Mahesh Babu : మహేష్‌బాబుకి వీరాభిమానిని : నాగ శౌర్య హీరోయిన్ షిర్లే సేటియా.!
NQ Staff - December 3, 2022 / 07:45 PM IST

Mahesh Babu : నాగ శౌర్య సరసన ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో హీరోయిన్గా నటించిన షిర్లే సేటియా గుర్తుంది కదా.? కేవలం నటి మాత్రమే కాదు, ఆమె మంచి సింగర్ కూడా. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకున్న షిర్లే సేటియా, తన తదుపరి ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సోషల్ మీడియాలో షిర్లే సేటియాకి బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అభిమానులతో వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటుంది షిర్లే సేటియా.
మహేష్‌బాబు ఈ ఏడాదిలో చాలా చాలా సమస్యలెదుర్కొన్నారు..
సూపర్ స్టార్ మహేష్‌బాబు అంటే తనకు చాలా చాలా ఇష్టమనీ, ఆయనకు తాను వీరాభిమానిననీ చెప్పుకొచ్చింది షిర్లే సేటియా. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించింది షిర్లే సేటియా.
‘గడచిన ఏడాది కాలంగా ఆయన చాలా స్ట్రాంగ్‌గా వున్నారు..’ అంటూ మహేష్ ఎదుర్కొన్న కుటుంబ పరమైన విషాదాల గురించి షిర్లే సేటియా పేర్కొంది. ఆయనకీ ఆయన కుటుంబానికీ మంచి జరగాలని ఆశిస్తున్నానని పేర్కొందీ భామ.
మహేష్ తొలుత తన సోదరుడు రమేష్‌బాబుని కోల్పోయారు.. ఆ తర్వాత తల్లిని కోల్పోయారు. కొద్ది రోజుల క్రితమే తండ్రి కృష్ణనీ కోల్పోయారు మహేష్‌బాబు.