Naga Chaitanya : సమంత చేయలేని పనిని బాలయ్య చేశాడు.. చైతూకు షాక్ ఇచ్చాడుగా..!
NQ Staff - January 26, 2023 / 01:50 PM IST

Naga Chaitanya : ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వివాదం కార్చిచ్చులా అంటుకుంటోంది. అదేంటంటే బాలయ్య చేసిన అక్కినేని, తొక్కినేని అనే మాటల వివాదం. బాలయ్య గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అప్పుడప్పుడు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి చివరకు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు బాలయ్య.
ఆయన తాజాగా నటించిన మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అయింది. అయితే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ.. ఆ రంగారావు, ఈ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ ఏఎన్నార్ ను అవమానించాడు. దాంతో అక్కినేని ఫ్యామిలీ సీరియస్ గా ఉంది.
విడాకుల తర్వాత..
ఇక చైతూ, అఖిల్ లు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు. ఇక్కడే ఓ మ్యాటర్ ఉంది. అదేంటంటే.. మామూలుగా చైతూ ఎన్నడూ సోషల్ మీడియాను పెద్దగా వాడడు. తన పర్సనల్ విషయాలను కూడా పోస్టు చేయడు. అప్పట్లో సమంత విడాకులు తీసుకున్న తర్వాత చైతూను డైరెక్టుగానే చాలా నెగెటివ్ కామెంట్లు చేసింది.
కానీ చైతూ పెద్దగా స్పందించలేదు. ఆయన కేవలం తన సినిమా విషయాలను చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియాను వాడుతాడు. అంతే తప్ప ఎవరి బర్త్ డేలకు, ఈవెంట్లకు, స్పెషల్ రోజులకు ఆయన పోస్టులు పెట్టరు. ముఖ్యంగా వ్యక్తుల గురించి అస్సలు పోస్టు చేయడు. కానీ మొదటిసారి బాలయ్య కారణంగా పోస్టు చేశాడు చైతూ. అంటే సమంత తీసుకురాలేని మార్పును బాలయ్య తెచ్చాడన్నమాట.