నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ కూడా ఓటిటిలో రానుందా!

Advertisement

కరోనా ప్రారంభం ఐన్నప్పటి నుండి దేశంలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే ఇప్పటికే అన్ లాక్ మొదలు కావడంతో చాలా పరిశ్రమలు తెరుచుకున్నాయి. అయితే థియేటర్స్ మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. అయితే ఇప్పటికి విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీస్ ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణ అండ్ హిజ్ లీల, ఉమ మహేశ్వర ఉగ్ర రూపాస్య, V వంటి మూవీస్ అమెజాన్ ప్రైమ్ లో, నెట్ఫ్లిక్ వంటి ప్లాట్ఫామ్స్ లలో స్ట్రీమ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ కూడా ఓటిటిలో స్ట్రీమ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ మూవీ యొక్క ఆ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి తరువాత ఓటిటిలో రిలీజ్ చేయననున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి కూడా నటించనుండగా ఈ మూవీని శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ యూనిట్ ఇప్పుడు కర్నూల్ పరిశర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ ఓటిటిలో వస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here