Naga Chaitanya : శోభిత ధూళిపాళతో నాగచైతన్య.! డేటింగ్ రూమర్స్ మరింత బలంగా.!
NQ Staff - November 26, 2022 / 06:27 AM IST

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య కొన్నాళ్ళ క్రితం సమంత రూత్ ప్రభుతో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి, ఇద్దరూ ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడంతో, ఆ వైవాహిక బంధానికి ముగింపు పలికేయాలనే నిర్ణయానికి వచ్చి విడాకులు తీసుకున్నారు.. అదీ పరస్పర అవగాహనతో.
ఇంతకీ, నాగచైతన్య తదుపరి లక్ష్యమేంటి.? ఎవర్ని పెళ్ళి చేసుకోబోతున్నాడు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా బిజీగా వున్నాడు నాగచైతన్య. ‘కస్టడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ అక్కినేని హీరో.
శోభిత ధూళిపాళతో ఎఫైర్ నడుస్తోందా.?
తాజాగా నటి శోభిత ధూళిపాళతో అక్కినేని నాగచైతన్య కలిసి వున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇటీవల వెకేషన్ సందర్భంగా ఈ ఇద్దరూ కెమెరాలకు చిక్కారంటూ ఊహాగానాలు గుప్పుమంటున్నాయి.
నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తీయించుకున్న ఫొటో అనే ప్రచారం తెరపైకొచ్చింది. అయితే, ఈ విషయమై ఇంతవరకు నాగచైతన్యగానీ, శోభితగానీ స్పందించలేదు. శోభిత మన తెలుగమ్మాయే. తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది శోభిత.
ఇంతకీ, నాగచైతన్య – శోభిత మధ్య ఎలాంటి సంబంధం వుంది.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.