Naga Babu : సిగ్గు చేటు… చరిత్రలో ఇదే మొదటిసారి : నాగబాబు
NQ Staff - January 20, 2023 / 04:12 PM IST

Naga Babu : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్లను వైకాపా ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల యొక్క ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నేత నాగబాబు స్పందించారు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కి ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటి సారి. డి ఎ, జిపిఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక.. ఆందోళన చేయడానికి అనుమతి దొరకక ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ ని కలిశారని ఆయన పేర్కొన్నారు.
ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థ పై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు కలిగి ఉన్న గవర్నర్ కి మొర పెట్టుకునే స్థితికి ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం తీసుకు వచ్చింది అంటూ నాగబాబు విమర్శించారు. ఉద్యోగుల యొక్క ఫిర్యాదుతో వైసిపి యొక్క అసమర్ధ పాలనకు మరోసారి తేటతెల్లమయ్యిందని నాగబాబు ఎద్దేవ చేశారు.