నీ అంత క్రేజ్ ఎవ్వరికీ రాలేదు.. అభిజిత్ పై నాగబాబు కామెంట్స్
NQ Staff - December 27, 2020 / 10:24 AM IST

బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ఆరంభానికి ముగింపుకు ఎంతో తేడా ఉంది. షో ఆరంభంలో ఉన్న నెగెటివిటీ ముగింపులో లేదు. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో స్టార్ మాను, బిగ్ బాస్ టీంను మొదట్లో జనాలు ఏకిపారేశారు. కానీ రాను రాను ఆ కంటెస్టెంట్ల పై అభిమానాన్ని పెంచుకున్నారు. సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దిగారు. సోషల్ మీడియాలో వార్ చేశారు. ఒకరి పై మరొకరు దూషణలకు దిగారు.

Naga babu about Abhijeet Craze
అయితే ఈ నాల్గో సీజన్‌లో చివరి వరకు ఉన్న అభిజిత్ అఖిల్ సోహెల్ అరియానా హారికలకు ఎంత పేరు వచ్చిందో మధ్యలో ఎలిమినేట్ అయిన వారికి కూడా దాదాపు అంతే ఫేమ్ నేమ్ వచ్చింది. దివి, మెహబూబ్ కుమార్ సాయి వంటివారు మంచి పేరుసంపాదించుకుని తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.అయితే ఈ నాల్గో సీజన్ మొత్తంలో అత్యంత పరిపక్వత కలిగిన మనిషిగా అభిజిత్ పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా బిగ్ బాసే గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పేశాడు.
ముందు నుంచి కూడా అభిజిత్ అంటే నాగబాబు ప్రత్యేకమైన శ్రద్ద కనబరుస్తున్నాడు. గెలవాలని, గెలుస్తాడని బలంగా నమ్మాడు, చివరకు అదే నిజమైంది. తాజాగా అభిజిత్ మెగా బ్రదర్ కలిశాడు. అండంగా ఉంటానని అన్నాడు. అయితే బిగ్ బాస్ విన్నర్లు అయిన ముందు కంటెస్టెంట్ల కంటే అభిజిత్‌కే ఎక్కువ క్రేజ్ ఉందని, వచ్చిందని ప్రశంసలు కురిపించాడు. బిగ్ బాస్ గెలుపు అనేది కెరీర్ స్టార్టింగ్ పాయింట్‌లా ఉండాలి.. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుతున్నాను అని నాగబాబు చెప్పుకొచ్చాడు.