Tollywood : ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు మూవీలోని బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడుగా..!
NQ Staff - January 26, 2023 / 12:15 PM IST

Tollywood : సినీ ఇండస్ట్రీలో రాణించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కొందరు మాత్రమే స్టార్లుగా ఎదుగుతుంటారు. ఎంతో కష్టపడినా సరే ఒక్కోసారి ఛాన్స్ రాకపోవచ్చు. అయితే ఇండస్ట్రీలోకి చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన చాలామంది పెద్దయ్యాక కూడా యాక్టర్లుగా మారుతుంటారు.
ఇలా చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలామంది పెద్దయ్యాక హీరోలుగా కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోయేది కూడా ఇలాంటి విషయమే. వెంకటేశ్ హీరోగా సౌందర్య, వినీత హీరోయిన్లుగా చేసిన సినిమా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు.
చైల్డ్ ఆర్టిస్టుగా..

Naga Anvesh Trying For Opportunities In Industry
ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ కొట్టింది. ఇందులో వెంకటేశ్ కొడుకుగా నటించిన వ్యక్తి పేరు నాగ అన్వేష్. ఈయన చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో చేశాడు. కాగా పెద్దయ్యాక ఆయన హీరోగా కూడా మారాడు. 2015 లో వచ్చిన వినవయ్య రామయ్య అనే సినిమాతో హీరోగా మొదటి సారి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఎంట్రీ ఇచ్చిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఆయన నిరాశ పడకుండా ఏంజెల్ సినిమాలో హీరోగా నటించాడు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆయన ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు.