Nabha Natesh : నభా నటేష్ ‘ఇస్మార్ట్ ‘ఐస్‌క్రీం’ సొగసులు చూడతరమా.!
NQ Staff - November 28, 2022 / 03:34 PM IST

Nabha Natesh : ఇస్టార్ట్ బ్యూటీ నభా నటేష్ అందం కేవలం సోషల్ మీడియాకే పరిమితమైపోతోంది పాపం.! ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే కుర్రకారును తన బుట్టలో వేసుకుంది.
క్యూట్‌గా కవ్విస్తూ కుర్రకారుకు దగ్గరైపోయింది అందాల నభా నటేష్. మొదట్లో కేవలం నటనా ప్రతిభతోనే ఆకట్టుకుంటుందనుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించని విధంగా గ్లామర్ తెరలు తెంచేసింది.
మోడ్రన్ లుక్స్‌లో నభా సో క్యూట్ సుమా.!
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో పూరీ మార్కు గ్లామర్ సెగలతో కుర్రోళ్లకు ప్రేమ వలలు విసిరింది. ఈ సినిమాతో ‘ఇలియానా 2.0’ అంటూ పూరీ జగన్నాధ్‌తో సర్టిఫికెట్ కూడా తీసుకుంది నభా నటేష్.
ఈ ఇమేజ్ తెచ్చుకోవడం అంత ఆషా మాషీ కాదు. కానీ, ఇమేజ్ అయితే వచ్చింది కానీ, ఆ ఇమేజ్‌ని నిలబెట్టుకోవడం కత్తి మీద సామే అయ్యింది నభా నటేష్‌కి. ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు పడక తెగ సతమతమవుతోందీ కన్నడ సోయగం.

Nabha Natesh Latest Beautiful Photos
‘సోలో బతుకే సో బెటర్’, ‘మ్యాస్టో’, ‘అల్లుడు అదుర్స్’ తదితర సినిమాల తర్వాత మరో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది నభా నటేష్. ఏదో ఒక సినిమా చేసేయడం కాదు, కాస్తయినా ప్రాధాన్యత వున్న సినిమాలో నటించాలని వెయిట్ చేస్తున్నా.. అంటున్న నభా నటేష్ ఈ లోపు ఇన్‌స్టాలో ఫాలోయింగ్ పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అందులో భాగంగానే డిఫరెంట్ పోజుల్లో ఫోటో సెషన్లు చేయించుకుంటోంది. స్టైలిష్‌గా ఐస్ క్రీమ్ తింటూ, మోడ్రన్ అవుట్ ఫిట్‌లో ఫోటోలకు పోజిచ్చింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో హల్చల్ చేస్తున్నాయ్.