Mysterious Video : గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నాయెందుకబ్బా.?

NQ Staff - November 23, 2022 / 09:07 AM IST

Mysterious Video : గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నాయెందుకబ్బా.?

Mysterious Video : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నాయ్.! ఆ సర్కిల్ కూడా పక్కాగా కనిపిస్తోంది. అంత గుండ్రంగా తిరగాలని ఆ గొర్రెలకు ఎందుకు అనిపించిందబ్బా.?

ఈ వింత చైనాలో చోటు చేసుకుంది. కొన్ని రకాలైన సూక్ష్మజీవుల ప్రభావంతో ఏర్పడే మెదడు ఇన్ఫెక్షన్ల వల్ల జంతువుల్లో ఇలాంటి విపరీతమైన మార్పులు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. దాంతో, ప్రపంచమంతా ఒక్కసారిగా వణికిపోయింది.

చైనా మీడియా విడుదల చేసిన వీడియో..

చైనా అధికారిక మీడియా సంస్థ ఈ గుండ్రంగా తిరుగుతున్నగొర్రెల వ్యవహారానికి సంబంధించిన వీడియో విడుదల చేసే సరికి, ‘కరోనా వైరస్’ లాంటిదేమన్నా కొత్త వైరస్ పుట్టుకొచ్చిందా.? అని అంతా కంగారుపడ్డారు. కానీ, ఆ గొర్రెలన్నీ ఆరోగ్యంగా వున్నాయనీ, వాటికి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని తేలేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గొర్రెలు ఎప్పుడూ మందగానే వుంటాయి. ఒక గొర్రెను ఇంకో గొర్రె అనుసరిస్తూ వెళుతుంటుంది.. అది సమూహ భద్రత కోసం. అలా పెద్ద సంఖ్యలో గొర్రెలు ఒకేసారి ఎత్తైన ప్రదేశాల నుంచి కిందపడి చచ్చిపోవడమూ చూస్తుంటాం.

ఓ గొర్రె వృత్తాన్ని అనుసరించగా, ఆ గొర్రెనే మిగతా గొర్రెలూ ఫాలో అయ్యాయని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు, ఏకంగా పన్నెండు రోజులపాటు గొర్రెలు అలా ఆ వృత్తాకారంగా తిరగడం వెనుక మర్మం ఏమిటో.?

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us