Mynampally Rohit : మెదక్ లో రో‘హిట్’..

NQ Staff - December 3, 2023 / 03:02 PM IST

Mynampally Rohit : మెదక్ లో రో‘హిట్’..

Mynampally Rohit :

బీఆర్ఎస్ కంచుకోటలో హస్తం హవా నడిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి యువ సంచలనం మైనంపల్లి రోహిత్ విజయ దుందుభి మోగించారు. పద్మా దేవేందర్ రెడ్డిపై రోహిత్ 10,157 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

మైనంపల్లి హన్మంతరావు తనయుడైన రోహిత్.. ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. బీఆర్ఎస్ నుంచి తనకు రెండు సీట్లు కావాలని హన్మంతరావు బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేయగా.. ఆ పార్టీ అధిష్ఠానం అక్కడ పద్మా దేవేందర్ రెడ్డికి సీటు ఇచ్చింది. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరూ కాంగ్రెస్ లో జంప్ అయ్యారు.

యూత్ ఫాలోయింగ్, కాంగ్రెస్ గాలిలో సీనియర్ లీడర్ అయిన పద్మా దేవేందర్ రెడ్డిపై యువ నాయకుడు రోహిత్ గెలుపొందడం విశేషం. ఇదిలా ఉండగా మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయారు. దీంతో తాను గెలవకున్నా తనయుడి గెలుపును చూసి మైనంపల్లి మురిసిపోతున్నారు. తన రాజకీయ వారసుడికి జనాల్లో గ్రీన్ సిగ్నల్ దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us