నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్.. మెగా కోడలు ఉపాసన సంచలన వ్యాఖ్యలు

Admin - October 24, 2020 / 01:27 PM IST

నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్.. మెగా కోడలు ఉపాసన సంచలన వ్యాఖ్యలు

మెగా స్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన అందరికి తెలిసిందే. ఆమె సాధారణంగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టి పబ్లిక్ లో అవగాహనా కల్పిస్తూ ఉంటారు. ఇప్పటికే విదేశీ మరుగుదొడ్లు కాకుండా స్వదేశీ పద్దతిలో మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి అని అవగాహనా కల్పించారు. ఇలా కూర్చోవడం వలన బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఉపాసన. అలాగే మరోసారి పేడతో అనేక ఆర్గానిక్ ఉత్పత్తులు చేయొచ్చని స్వయంగా చేతిలో పేడ పట్టుకొని పబ్లిక్ కు అవగాహనా కలిపించారు.

ఇలా అనేక రకాలుగా తనదైన శైలిలో అవగాహనా కలిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా ఒక ఇంటర్ వ్యూ లో పాల్గొన్న ఉపాసన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతిఒక్కరు కూడా ఆడవారిని గౌరవించాలని చెప్పుకొచ్చారు. అయితే స్ట్రాంగ్ ఉమెన్ ను అబ్బాయిలు భరించలేరు అంటారు కదా అని అడగగా.. స్ట్రాంగ్ మెన్ ను అమ్మాయిలు కూడా భరించలేరు కదా అని సమాధానం ఇచ్చింది ఉపాసన.

ఇక ఆ తరువాత ప్రస్తుతం ఉన్న ఈ సొసైటీ లో మీరు చెప్పేవి అన్ని కూడా సాధ్యమవుతాయా అని అడగగా.. ఊహించని సమాధానం ఇచ్చింది ఉపాసన. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఒక్కసారిగా ఆమె ఈ మాటలు అనేసరికి అందరు షాక్ అయ్యారని చెప్పాలి. ఏదైతేనేం పబ్లిక్ కు తనదైన రీతిలో అవగాహనా కలిపిస్తున్న ఉపాసనకు ధన్యవాదాలు అని అభిమానులు స్పందిస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us