ఏంఎస్ వ్యాధిగస్తులకు అవగాహనా కల్పించిన ఏం.ఏం కీరవాణి

Admin - September 22, 2020 / 10:32 AM IST

ఏంఎస్ వ్యాధిగస్తులకు అవగాహనా కల్పించిన ఏం.ఏం కీరవాణి

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏం ఏం కీరవాణి ఎంఎస్‌ (మల్టిపుల్‌ సెలిరోసిస్‌) అనే వ్యాధితో బాధపడుతున్నా వారికీ అవగాహనా కల్పిస్తున్నారు. అయితే ఆయన స్వయంగా ట్విటర్‌ ద్వారా ఈ అవగాహనా కల్పిస్తూ పలు విషయాలు తెలిపారు. ఇక ఈ వీడియోలో మాట్లాడుతూ.. మల్టిపుల్‌ సెలిరోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నా వారు ఆందోళన చెందొద్దని ఆయన సూచించాడు. ఈ వ్యాధి ఎటువంటి వయసులో ఉన్నవారికైనా రావొచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుంది.

ఈ వ్యాధిపై ‘ఎంఎస్‌ ఇండియా’ ప్రజలలో అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వానికి తన గొంతును వినిపిస్తోంది. ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతిఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా అని కొనియాడారు. అలాగే ఈ వ్యాధి సోకినా వారు యోగా, సంగీతం వంటి వాటితో ఈ వ్యాధి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని కీరవాణి వెల్లడించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us