JC Brothers : జేసీ బ్రదర్స్ కు మున్సిపల్ ఎన్నికల ఫీవర్..ఆ ఒక్క వార్డ్ లోనే!?
Mamatha 600 - March 6, 2021 / 08:01 PM IST

JC Brothers : జేసీ బ్రదర్స్ గురించి తెలియని వాళ్లు చాలా అరుదుగా ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. సుదీర్ఘకాలంగా రాజకీయాలత అనుబంధం ఉన్న ఈ అన్నదమ్ములు. జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి నియోజకవర్గం ఎంత కంచుకోటో ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2014 ఎన్నికలకు ముందు వరకు ఇద్దరు కాంగ్రెస్ నుంచి తాడిపత్రిని ఏలారు. ఆ ఎన్నికల్లో వీరు టీడీపీలోకి వచ్చినా మళ్లీ తాడిపత్రిలో గెలిచి పట్టు నిలుపుకున్నారు.

Municipal Election Tension For JC Brothers
అయితే గత ఎన్నికల్లో పోటీకి ఈ ఇద్దరు సోదరులు దూరంగా ఉండి.. తమ తనయులను పోటీ చేయించగా ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఈ సారి మున్సిపల్ ఎన్నికలను ఈ ఇద్దరు సోదరులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరికి మున్సిపల్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు.
జేసీ బ్రదర్స్‌కు మున్సిపల్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రిలో 24వ వార్డు నుంచి ఆయన బరిలో దిగారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి విదితమే. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై వైసీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రభాకర్‌రెడ్డి గెలుపుపై జేసీ దివాకర్‌రెడ్డి టెన్షన్ పడుతున్నారు. గత ఎన్నికల్లో 24వ వార్డు నుంచి జగదీశ్వర్ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కౌన్సిలర్‌గా గెలిపించేందుకు జేసీ ఫ్యామిలీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాను పని చేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి పోటీ చేయడం గమనార్హం. తాడిపత్రిలో ఓటర్లను జేసీ బ్రదర్స్ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న 10 మంది జేసీ బ్రదర్స్ అనుచరులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ.82 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతూ పట్టుబడ 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.