Mumbai : మీ చావు – మా కార్యక్రమం… సరికొత్త స్టార్టప్‌

NQ Staff - November 22, 2022 / 10:21 AM IST

Mumbai : మీ చావు – మా కార్యక్రమం… సరికొత్త స్టార్టప్‌

Mumbai : మారుతున్న కాలంకు అనుగుణంగా వ్యాపారం ను మార్చుకుంటూ పోవాలి. కొత్త పోకడల్లో వ్యాపారం చేసిన వారికే సక్సెస్‌ లభిస్తుంది.. నాలుగు రాళ్లు వెనుక పడుతాయి. ఇప్పుడు అదే పద్దతి కొనసాగిస్తూ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ కు మంచి వ్యాపారం లభిస్తుంది.

ఒకప్పటి మాదిరిగా కాకుండా పెళ్లి లేదా మరేదైనా కార్యక్రమానికి అప్పటికప్పుడు బందు మిత్రులు వచ్చి నాలుగు అక్షింతలు వేసి లేదా ఒక ముద్ద తిని వెళ్తున్నారు. కనుక ఫంక్షన్ పనులు అనేవి ఇంటి వారు చేసుకోవడం అసాధ్యంగా మారింది. కనుక ఈ సమయంలో మ్యారేజ్‌ ఈవెంట్స్ చేసే వారు రెడీ అవుతున్నారు.

పెళ్లి అనే కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏకంగా చావును కూడా శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు స్టార్టప్‌ మొదలు అయ్యింది. మీ చావును మేము మా కార్యక్రమంగా భావించి పూర్తి చేస్తాము అన్నట్లుగా ఒక స్టార్టప్ మొదలు అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు ముందు కార్యక్రమం మొదలుకుని చివరకు హస్తికలను గంగలో కలపడం.. డెత్‌ సర్టిఫికెట్‌ ను తీసుకు రావడం వరకు అన్ని కూడా తాము చూసుకుంటాం అంటూ సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ముందుకు వచ్చారు.

కొందరు వీరిని అభినందిస్తూ కొత్త వ్యాపారం కొత్త ఆలోచన నిజంగా అభినందనీయం. ఈ సమయంలో కొందరు తమ వారు చనిపోయిన సమయంలో అవస్తలు పడుతున్నారు. అలాంటి వారి కోసం మీరు ఉన్నారు అనేది భరోసా కలిగిస్తుంది అంటున్నారు. కొందరు మాత్రం దీన్ని కూడా వ్యాపారం చేశారా అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us