రూ. 1000కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న ముంబై పోలీసులు

Advertisement

ఆఫ్గనిస్తాన్ నుండి ఇండియాలోని ముంబైకు తరలిస్తున్న హెరాయిన్ మాదక ద్రవ్యాలను ముంబై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని పోర్ట్ లో 191 కిలోల హెరాయిన్ మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని, ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరకడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ముంబై మాదక ద్రవ్యాలు విరివిగా దొరుకుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆఫ్గనిస్తాన్ నుండి ఇరాన్ మీదుగా ఇండియాకు తరలించారు. ప్లాస్టిక్ పైపులలో పెట్టిన మాదక ద్రవ్యాలు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు కస్టమ్స్‌ అధికారులతో కలిసి సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి వీటిని పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాలను ముంబయి నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగమైన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటికే అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్గనిస్తాన్ ప్రపంచ దేశాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేయడంలో కేంద్రంగా ఉంది. యూరప్, భారత్ వంటి దేశాలకు రోడ్, సముద్ర మార్గాల ద్వారా ఈ మాదకద్రవ్యాలు దొంగచాటుగా సరఫరా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here