Mumbai Court: శృంగారంలో పాల్గొన్నాక పెళ్లి త‌ప్ప‌నిస‌రా.. ముంబై కోర్టు సంచ‌ల‌న కామెంట్స్

Mumbai Court: హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లికి ముందు ఎవ‌రు శృంగారంలో పాల్గొన‌కూడదు. కాని మారుతున్న ప‌రిస్థితుల‌లో కొంద‌రు వీటిని పెడ‌చెవిన పెట్టి ప్రేమ‌, శృంగారం అంటూ రెచ్చిపోతున్నారు. మోస‌పోయాక వారు త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ కోర్టు మెట్లెక్కుతున్నారు.ఇంకొంద‌రు అబ్బాయి ఇంటి ద‌గ్గ‌ర కూర్చొని ధ‌ర్నాలు చేస్తున్నారు. శృంగారం త‌ర్వాత నాకు అన్యాయం జ‌రిగింద‌ని భావించే మ‌హిళ‌ల‌కు ముంబై కోర్ట్ షాకిచ్చింది.


Mumbai Court Shocking Judgement Over sexual Life
Mumbai Court Shocking Judgement Over sexual Life

ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఉన్నంత మాత్రాన వారు పెళ్లి చేసుకోవడం తప్పనిసరి ఏమీ కాదంటూ ముంబై సెషన్స్ కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసు విచార‌ణ‌లో న్యాయ‌స్థానం.. ఇద్ద‌రు వ్య‌క్తులు శృంగారం చేసుకుంటే వారు త‌ప్ప‌క పెళ్లి చేసుకోవాల‌ని రూలేమి లేద‌ని తీర్పు ఇచ్చింది. ఈ వ్యాఖ్య‌లు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఈ ఏడాది జనవరిలో తనకు పెళ్లి అయిందని పెళ్లి తర్వాత తాను అత్తవారింట్లో రెండు నెలల పాటు ఉన్నానని తన భర్త, మామ, భర్త స్నేహితుడు నిత్యం తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో భర్తను ప్రధాన ముద్దాయిగా పేర్కొని అతని తండ్రిని రెండో ముద్దాయిగా స్నేహితుడిని మూడో ముద్దాయిగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

ఈవిష‌యంపై మ‌హిళ కోర్టు మెట్లెక్క‌గా , అక్క‌డ తాను మాట్లాడుతూ.. న‌న్ను పెళ్లిచేసుకోకుండా లోబ‌ర్చుకొని మోసం చేశాడని వాపోయింది. అయితే థానే లోని ఓ హోటల్ లో వారు కలిసి ఉన్నట్లుగా చెప్పిన వివరాలను బట్టి వారిద్దరికీ ఎఫైర్ ఉందని ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగిక సంబంధాన్ని కొనసాగించినట్లు అభిప్రాయపడ్డారు . ఆ తర్వాత ఏదో కారణంతో వారి బంధం తెగిపోయింది ఉండొచ్చని భావించిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నిందితుడిత‌పై ఫిర్యాదు చేసిన మ‌హిళ విద్యావంతురాలు మ‌రియు మేజ‌ర్. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే జ‌రిగే ప‌ర్య‌వ‌సానాలు ఆమెకు తెలిసి ఉంటుంది.పెళ్లి పేరుతో అతను ప్రలోభ పెట్టాడు అని భావించడానికి వీలు లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం న్యాయస్థానం ముందుకు వచ్చిన బెయిల్ దరఖాస్తుకు మాత్రమే ఈ వ్యాఖ్యలు పరిమితమని సూచించింది. ప్రేమించుకోవడం పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను కొనసాగించడం ఆ తర్వాత వివిధ కారణాలతో రిలేషన్ దెబ్బతింటే రచ్చ చేయడం అలవాటుగా మారింది అని ఇలాంటి వ్యవహార విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోర్టు తెలిపింది.