థియేటర్స్ ను ఓపెన్ చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్న మల్టీప్లెక్స్ ఓనర్స్

Advertisement

దేశంలో అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుండి అనేక పరిశ్రమలు తెరుచుకున్నాయి. కానీ థియేటర్స్ మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. అయితే థియేటర్స్ ను ఓపెన్ చేయాలని థియేటర్స్ ను ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని మొదటి నుండి కోరుతున్నారు. కానీ ఇంకా థియేటర్స్ ను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా థియేటర్స్ ను ఓపెన్ చేయాలని మల్టీప్లెక్స్ ఓనర్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

కరోనా నిబంధనలను పాటించడానికి థియేటర్స్ లో అన్ని వసతులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచంలో చైనా, యూకే, కొరియా, యూఎస్ఈ, యూఎస్, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ ఓపెన్ అయ్యాయని, అక్కడ ప్రజలు కూడా అందుకు సహకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. థియేటర్స్ మూతపడటం వల్ల అనేకమంది ఉపాధి కోల్పోయారని, ఇప్పటికే తమకు చాలా నష్టం వచ్చిందని పేర్కొన్నారు. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here