Mukesh Ambani : ట్విన్స్‌తో పుట్టింటికి వస్తున్న ఇషా అంబానీ.! వెల్‌కమ్ మామూలుగా లేదుగా.!

NQ Staff - December 25, 2022 / 11:15 AM IST

Mukesh Ambani : ట్విన్స్‌తో పుట్టింటికి వస్తున్న ఇషా అంబానీ.! వెల్‌కమ్ మామూలుగా లేదుగా.!

Mukesh Ambani : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట సంతోషం నిండింది. ముఖేష్ ముద్దుల తనయ ఇషా అంబానీకి ట్విన్స్ పుట్టడమే ఆ ఆనందానికి కారణం.

రెండేళ్ల క్రితం రంగ రంగ వైభవంగా వివాహం చేసుకున్న ఇషా తాజాగా ట్విన్స్‌కి జన్మనిచ్చింది. నవంబర్ 19న ట్విన్స్‌కి జన్మనిచ్చిన ఇషా, తొలిసారి పుట్టింటికి వస్తున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ తన ముద్దుల తనయకూ, ఆమె పిల్లలకూ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వెల్‌కమ్ సమయంలో, ముఖేష్ అంబానీ భారీగా నజరానాలు ప్రకటించారు. ఏకంగా 300 కేజీల బంగారాన్ని దేవాలయాలకు కానుకలుగా ఇవ్వబోతున్నారట.

ఇంతకన్నా గ్రాండ్ వెల్‌కమ్ ఎక్కడైనా వుంటుందా.?

పిల్లలకు ఎలాంటి దిష్టి తగలకుండా ప్రత్యేకమైన శాంతి పూజలు చేయబోతున్నారట. ఈ పూజ కోసం ప్రత్యేకమైన ప్రసాదాలు తయారు చేయిస్తున్నారట ముఖేష్ అంబానీ.

ప్రత్యేక విమానంలో ముంబైలోని ఇంటికి వచ్చారు తల్లీ పిల్లలు. వారి బాగోగులు చూసేందుకు ముంబైలోని టాప్ డాక్టర్లను హైర్ చేశారు ముఖేష్ అంబానీ.

తొలిసారి ఫ్టైట్‌లో ప్రయాణిస్తున్న ఆ పసికందులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసేందుకే అంత మంది డాక్టర్లను అందుబాటులో వుంచారాయన. ముంబైలో అత్యంత ఖరీదైన డాక్టర్‌గా పేరున్న గిబ్బన్ కూడా ఈ టీమ్‌లో వుండడం విశేషం. ఎంతైనా ముఖేష్ అంబానీ వారసులు కదా.. ఆ మాత్రం గ్రాండ్‌నెస్ వుండాల.!

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us