Mudragada Padmanabham : పవన్ కు ముద్రగడ లేఖ… ప్రశ్నలతో చురకలు

NQ Staff - June 20, 2023 / 05:59 PM IST

Mudragada Padmanabham : పవన్ కు ముద్రగడ లేఖ… ప్రశ్నలతో చురకలు

Mudragada Padmanabham : సుదీర్ఘ కాలంగా ఏ రాజకీయ పదవీ చేపట్టకుండా కేవలం కాపుల ప్రయోజనాలు కాపాడే ఉద్యమాల్లోనే జీవిస్తూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ముద్రగడ పద్మనాభం తాజాగా పవన్ కళ్యాణ్ కు గట్టి క్లాస్ పీకారు. తానూ ఏనాడూ ఉద్యమాన్ని అమ్ముకోలేదు అంటూ కాపు ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన పవన్ కు గట్టి మొట్టికాయ వేశారు.

ముందు మాట తీరు మార్చుకోండి.. తీరు మారాలండి .. వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి ? అంటూనే మీరు ఇంత వరకూ ఎంత మందికి చెప్పుతో కొట్టారు. ఎన్ని తొక్కలు తీశారు? ఎన్ని గుండ్లు గీశారు అంటూ ర్యాగింగ్ చేసారు. తాను ఏనాడూ ఓటమి ఎరుగను అంటూ నువ్వు రెండు చోట్లా ఓడిపోయావుగా అని చెప్పకుండానే వెక్కిరించారు.

తానూ ఇన్నేళ్ళుగా కాపుల ప్రయోజనాలు.. వారి రిజర్వేషన్ల కోసం మాత్రమే పని చేశాను తప్ప వేరేవారి పల్లకీకి భుజం కాయలేదు అని అన్నారు. తాను ఇన్నేళ్ళలో ఎన్నడూ సూట్ కేసులకు అమ్ముడు పోలేదు అని ఘంటాపథంగా చెప్పారు. తాను ఏనాడూ కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేదని, తానూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కుల అస్తిత్వం కాపాడడానికి .. వారి ప్రయోజనాలకోసమే పోరాడుతూ ఉన్నానని అన్నారు.

Mudragada Padmanabham Recently Got Angry With Pawan Kalyan

Mudragada Padmanabham Recently Got Angry With Pawan Kalyan

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో అవమానకరంగా మాట్లాడిన పవన్ ను ఈ లేఖలో పద్మనాభం ఉతికేసారు. దశాబ్దాలుగా ద్వారంపూడి కుటుంబం ప్రజా జీవనంలో ఉందని గుర్తు చేస్తూనే కాపు ఉద్యమానికి నిత్యం వారితో బాటు వారి తండ్రి , తాతయ్య సైతం వెన్ను దన్నుగా నిలిచారని అన్నారు.

తాను ఎప్పుడు ఉద్యమం చేసినా అన్నివిధాలా వారి కుటుంబం సహకరిస్తూనే ఉండేది అని చెబుతూ ద్వారంపూడి కి తన మద్దతు తెలిపారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికీ మాట్లాడడం రాదని, డబ్బుకు కులాన్ని అమ్ముకునే వ్యక్తి అని వెక్కిరిస్తూ మర్యాదగా వాయించి పారేసారు ముద్రగడ పద్మనాభం.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us