Pawan Kalyan : దమ్ముంటే పిఠాపురం నుంచి నా మీద పోటీ చెయ్.. పవన్ కు ముద్రగడ సవాల్..!
NQ Staff - June 23, 2023 / 12:01 PM IST

Pawan Kalyan : ఏపీలో రాజీకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా సరే అప్పుడే రాజకీయ రణరంగం మొదలైంది. ప్రస్తుతం వారాహి యాత్రను గోదావరి జిల్లాల్లో చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో కాపుల సంక్షేమం గురించి కూడా మాట్లాడుతున్నారు.
ఈ సందర్భంగా పవన్ కు ముద్రగడ వరుసగా లేఖలు రాస్తున్నరు. తాజాగా మరో సారి లేఖ రాశారు. ఇందులో దాదాపు 30 ప్రశ్నలను సంధించారు ముద్రగడ. మీ అభిమానులతో బండ బూతులు తిట్టిస్తుననారు. దానికి నేను భయపడను. కాకినాడ ఎమ్మెల్యేతో పాటు నన్ను ఎందుకు తిడుతున్నారు.
నేనేమైనా మీ తొత్తునా.. మీరు చెప్పినట్టే వినాలా. అసలు ఏనాడైనా కాపుల సంక్షేమం గురించి, 1993, 94లో వారిపై పెట్టిన కేసుల గురించి మాట్లాడారా. వారిపై పెట్టిన కేసులను సీఎంలతో మాట్లాడి కొట్టివేయించారా. .. 2016 తుని ఘటన బాధితులను పలకరించారా. రంగా హత్య నిందితులను ఎప్పుడైనా పరామర్శించారా.. వారిని ఎప్పుడైనా కలిశారా.
మీరు ఇవేమీ చేయకుండా పోటీ చేస్తే గెలుస్తారా. కాకినాడ నుంచి పోటీ చేస్తారా లేదంటే పిఠాపురం నుంచి పోటీ చేయండి. నన్ను పోటీకి రమ్మనే ధైర్యం మీకు ఉందా అంటూ సవాల్ విసిరారు ముద్రగడ. ఆయన లేఖలో జగన్, చంద్రబాబులను పొగుడుతూ.. పవన్ ను విమర్శించడం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం.