ధోని రిటైర్మెంట్ పై తన భార్య సాక్షి భావోద్వేగం

Advertisement

ప్రముఖ ఇండియన్ క్రికెట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని అభిమానులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన భార్య సాక్షి సింగ్ కూడా స్పందించి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్టు చేశారు.

‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. మీకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు మీరు కన్నీటిని ఆపుకోలేకపోయారని గమనించాను. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను అలాగే ని విజయాలకు ప్రత్యేక శుభాకాంక్షలు. మనం చెప్పిన విషయాలను జనం మరిచిపోతారు. మనం చేసిన పనులను కూడా మరిచిపోతారు. కానీ మనం ప్రజలకు ఎటువంటి అనుభూతిని ఇస్తామో, దానిని వారు ఎప్పటికి మరిచిపోరు’ అంటూ సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here