కరోనా టెస్టులు చేయించుకున్న ధోని

Advertisement

టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని కరోనా టెస్టులు చేయించుకున్నారు. రాంచీలోని గురునానక్ హాస్పిటల్ లో ధోని టెస్టులు చేయించుకోగా, ఈరోజు సాయంత్రానికి వాటికి సంబంధించిన ఫలితాలు తెలియనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ లోని మరో ఆటగాడు మోను కుమార్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఇద్దరికి కరోనా నెగటివ్ వస్తే ఈనెల 15 నుండి 20 తేదీల మధ్య చెన్నై ఆటగాళ్లకు ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించనున్నారు. దీని తరువాత చెన్నై ఆటగాళ్లు 26 తేదీన యూఏఈకు బయలుదేరానున్నారు.

గత కొన్ని రోజులుగా ధోని ఫిట్ నెస్ పై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ షేన్‌వాట్సన్‌ ప్రశంసలు కురిపించాడు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ టీమ్‌ఇండియా మాజీ సారథి వయసుపైబడిన వాడిలా కనిపించడని చెప్పాడు. మహీకి ఇంకా ఆడాలని ఉందని, అతనెప్పుడూ ఎవర్‌గ్రీన్‌ ప్లేయర్‌ అని కొనియాడాడు. అతడు పూర్తిఫిట్‌నెస్‌తో ఉంటాడని, తన నైపుణ్యాలతో అబ్బురపరుస్తాడని తెలిపాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here