MS Dhoni : ఐపీఎల్ రిటైర్మెంట్‌పై స్పందించిన ధోని.. చివ‌రి మ్యాచ్ ఎక్క‌డ ఆడ‌తాడో తెలుసా?

MS Dhoni : ధోనీ ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2021 ఫైనల్ రోజున కూడా ఈ విషయంపై ప్రశ్నించగా.. తాను ఎల్లో జెర్సీలోనే ఉంటానని చెప్పాడు. తాజాగా తాను చివరి మ్యాచ్ చెన్నైలో ఆడి వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు.

MS Dhoni planing about his ipl retirement
MS Dhoni planing about his ipl retirement

2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కి సడన్‌గా గుడ్ బై చెప్పేసిన మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే.. ఐపీఎల్ 2022 తర్వాత ఈ ఫార్మాట్‌కి కూడా ధోనీ గుడ్ బై చెప్పబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఐపీఎల్ 2021 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలవగా.. ఆ టీమ్ ఫ్రాంఛైజీ తాజాగా చెన్నైలో విజయ సంబరాలు నిర్వహించింది.

MS Dhoni planing about his ipl retirement
MS Dhoni planing about his ipl retirement

ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతుండగా.. ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి చర్చ వచ్చింది. దాంతో.. చెన్నైలోనే తన చివరి టీ20 మ్యాచ్ ఉంటుందని స్పష్టం చేసిన ధోనీ.. అది వచ్చే ఏడాదా? లేదా ఐదేళ్ల తర్వాత అనేది తనకి తెలియదని తెలివిగా చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. 2020 ఐపీఎల్ సీజన్‌ని యూఏఈలో నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. 2021 సీజన్‌లో సగం మ్యాచ్‌ల్ని భారత్‌లో, మరో సగం యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.

గత రెండేళ్లుగా చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే.. ఐపీఎల్ 2022 సీజన్‌ని మాత్రం భారత్‌లో నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ చెన్నై టీమ్ కార్యక్రమంలోనే స్పష్టం చేశారు. ‘‘భారత్‌లో నేను చివరి వన్డేని రాంచీలో ఆడాను. అలానే నా చివరి టీ20 మ్యాచ్‌ని చెన్నైలో ఆడతాను.

అది 2022లోనా లేదా ఐదేళ్ల తర్వాత అనేది నాకు తెలియదు. ఫ్యాన్స్‌ మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆడుతున్నా.. అక్కడికి వచ్చి సపోర్ట్ చేశారు. టీమ్‌పై నిషేధం ఉన్న రెండేళ్లు కూడా సోషల్ మీడియాలో చెన్నై టీమ్ గురించి అభిమానులు ఎక్కువగా మాట్లాడటం వారి ప్రేమకి నిదర్శనం’’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.