నేను కూడా క్రికెట్ ను వదిలేస్తున్న : పాకిస్తాన్ ధోని అభిమాని

Advertisement

టీమ్ ఇండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ధోని అభిమానులు తన విడ్కోలుకు తీవ్రంగా స్పందించారు. ఇది ఇలా ఉంటె తాజాగా పాకిస్తాన్ కి చెందిన ధోని అభిమాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ధోని ఒక్కడే క్రికెట్ ను వదలేయలేదని ధోనితో నేను కూడా క్రికెట్ ను వదిలేసానని అన్నాడు.

అయితే 2011 సంవత్సరం నుండి ధోనీ ఫ్యాన్ గా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన పాకిస్తాన్ కి చెందిన చికాగో చాచా నేడు క్రికెట్ పై కీలక వ్యాఖ్యలు చేసాడు. గొప్ప వాళ్ళు అందరూ ఏదో ఒకరోజు తప్పుకోవాలి అని, కాని ధోనీ క్రికెట్ నుండి విరమణ చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసాడు. అయితే నేను ధోనీని అభిమానించడంపై పాకిస్తాన్ లో చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను అని అన్నాడు. ఏదైతేనేం ధోని తిరిగి మళ్ళీ క్రికెట్ ఆడితే బాగుండు అని అభిప్రాయం వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here