టైం 7:29కే ధోని ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడో తెలుసా?

Advertisement

ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఇండియన్ మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించారు. ఇండియన్ క్రికెట్ కు ఎంతో సహకారం అందించిన ధోని సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత క్రికెట్ అభిమానులు ధోని సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మైదానంలో ధోని కొట్టే సిక్స్ లను, అతను చేసే స్టాంప్స్ కు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ధోని భారతీయ కాలమాన ప్రకారం సాయంత్రం 7:29 కు రిటైర్మెంట్ కు సంబంధించిన వార్తను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ టైం కు ఈ వార్తను పోస్ట్ చేయడం వెనక ఒక రహస్యం దాగుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే 2019 జులై 9 న ప్రపంచ కప్ నుండి ఇదే టైంకి అధికారికంగా వైదొలిగింది. ధోని ఔట్ అయిన తరువాత యూజువేందర్ చాహల్ 7:29కి ఔట్ అయ్యాడు. వరల్డ్ కప్ నుండి ఆఫీషల్ గా బయటకు వచ్చిన సమయానికి గుర్తుగా ఈ సమయానికే ట్వీట్ చేశాడనే వార్త వైరల్ అవుతుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here