Mrunal Thakur Is Demanding Remuneration : మృణాల్ మరీ ఎక్కువ పెంచేసిందట!
NQ Staff - July 7, 2023 / 07:55 PM IST

Mrunal Thakur Is Demanding Remuneration :
దుల్కర్ సల్మాన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు తెలుగులో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది.
ముఖ్యంగా నానితో నటించిన తర్వాత ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోత పెరిగిందని చెప్పాలి. హీరోయిన్ గా ఇటీవలే విజయ్ దేవరకొండకు జోడిగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ యొక్క పారితోషికం అమాంతం పెరిగింది.
నాని మరియు విజయ్ దేవరకొండ లతో కలిసి నటిస్తున్న సినిమాలకు తీసుకుంటున్న పారితోషికంతో పోలిస్తే కొత్తగా కమిట్ అవ్వబోతున్న సినిమాలకు భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఒక వైపు హిందీలో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు సౌత్ లో నటించాలి అంటే ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఇటీవల ఒక యంగ్ హీరో సినిమా కోసం ప్రముఖ నిర్మాత ఈమెని సంప్రదించాడట. మృణాల్ ఠాకూర్ చెప్పిన పారితోషకం విని అంతా షాక్ అయ్యారని తెలుస్తుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆ స్థాయి పారితోషికం డిమాండ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కొందరు ప్రేమ వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆమెకున్న క్రేజ్ ఇంకా బాలీవుడ్ లో స్టార్ డం నేపద్యంలో ఆ స్థాయిలో పారితోషికం తీసుకోవడంలో తప్పులేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.