చంద్రబాబుని హీరోని చేసిన విజయసాయి రెడ్డి? జగన్ కి చిర్రెత్తుకొచ్చింది..!
Ajay G - January 2, 2021 / 07:33 PM IST

ఎంపీ విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. సీఎం జగన్ కుడి భుజం లాగ. కానీ.. తాజాగా ఆయన చేసిన రచ్చ మామూలుగా లేదు. సీఎం జగన్ నే ఇరకాటంలో పడేసింది. అదే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జరిగిన ఘటన. రాముడి గుడిలో జరిగిన ఘటనపై ఎప్పుడూ స్పందించని విజయసాయి.. తాజాగా స్పందించడం పెద్ద రచ్చకు దారితీసింది.

mp vijayasai reddy responds over ramatheertham incident
రాముడి గుడిలో ఉన్న రాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ ఆలయాన్ని పరిశీలించడం కోసం వచ్చారు. అయితే.. చంద్రబాబు పర్యటనపై పెద్ద రచ్చ చేశారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు కానీ.. పోలీసులు అడ్డుకుంటే.. మొన్నటిలా రచ్చ అవుతుందనుకుని… విజయసాయిరెడ్డి ముందే రామతీర్థం చేరుకున్నారు.
అయితే విజయసాయిరెడ్డి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో వైసీపీకి, ప్రభుత్వానికే చెడ్డపేరులా అయింది. రామతీర్థంలో మీడియాతో మాట్లాడిన విజయసాయి… చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. చంద్రబాబుపై ఆరోపణలు చేయడంతో పాటు… లోకేశ్ విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అదే ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది.
ఎందుకంటే… లోకేశ్ సవాల్ విసిరింది సీఎం జగన్ కు కానీ.. విజయసాయిరెడ్డికి కాదు. కానీ.. విజయసాయిరెడ్డి ఈ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో అర్థం కాలేదు. విజయసాయిరెడ్డి.. ఊరికే ఉండకుండా.. ఇలా సీఎం జగన్ కు ఇబ్బందులు ఎందుకు సృష్టిస్తున్నారు.. అంటూ వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.