Mp Ravindra Kumar insulted in Parliament : పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ.. జగన్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది..!
NQ Staff - July 22, 2023 / 03:16 PM IST

Mp Ravindra Kumar insulted in Parliament : ఉన్నది లేనట్టు చెప్పడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా. ఆ పార్టీ నేతలు చేసే పనులు అప్పుడప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉంటాయి. చివరకు పరువు పోగొట్టుకుని తిట్ల పాలు కావాల్సిందే. ఉంటే మనమే ఉండాలి. అంతే తప్ప వైసీపీ హయాంలో అభివృద్ధి జరగొద్దు. మనం లేనప్పుడు రాష్ట్రం మొత్తం మట్టిగొట్టుకుని పోవాలి. మళ్లీ మనం వచ్చిన తర్వాత ఏదో చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి.
మొదటి నుంచి టీడీపీ వాళ్ల పరిస్థితి ఇంతే. ఇప్పుడు ఏపీలో అసలు పెట్టుబడులే లేవని.. జగన్ హయాంలో ఏమీ జరగనట్టు ఊహించుకున్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అత్యుత్సాహంతో పార్లమెంట్ లో నోరు జారాడు. అసలు ఏపీలో పెట్టుబడులు ఏమైనా వచ్చాయా అన్నట్టు ప్రశ్నించాడు.
దానికి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ ఇచ్చిన సమాధానం చూసి ఎంపీ బిక్కముఖం వేశాడు. అనవసరంగా అడిగి ఇరుక్కున్నానే అన్నట్టు ముఖం పెట్టేశాడు. ఏపీకి 2019 అక్టోబర్ – 2020 మార్చ్ మధ్య 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు, 2021-22 : 224.96 మిలియన్ డాలర్లు, 2022-23 : 284.22 మిలియన్ డాలర్లు వచ్చాయని కేంద్ర సహాయమంత్రి ఆధారాలతో సహా బయట పెట్టేశాడు.
ఒక్క కరోనా సంవత్సరంలో మాత్రమే కాస్త పెట్టుబడులు తగ్గాయని.. ఆ తర్వాత మళ్లీ పెట్టుబడులు పుంజుకున్నాయని చెప్పారు. ఇక 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావడం అంటే అదంతా జగన్ సత్తా అని చెప్పకనే చెప్పేశారు. దాంతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు సదరు ఎంపీ గారికి.
ఇలా జగన్ పాలన మీద బురద జల్లాలని అనుకుని.. చివరకు తామే బురదలో పడటం టీడీపీ బ్యాచ్ కు కొత్తేం కాదు. మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును కూడా ఇలాగే చిన్న చూపుతో హేళన చేశారు. కానీ ఆ సదస్సులో ఏపీకి వచ్చిన పెట్టుబడులు చూసి వారం రోజులు నిద్ర కూడా పోలేదు మన ఎల్లో బ్యాచ్.
అంబానీ, అదానీ, బిర్లా, భజంకా లాంటి బడా వ్యాపార సంస్థల అధినేతలు వచ్చి లక్షల కోట్లలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించేసరికి.. ఎల్లో మీడియాకు ఏం రాయాలో కూడా అర్థం కాలేదు. ఇలా ప్రతిసారి జగన్ తాను అనుకున్న పనిని చేసుకుంటూ ఏపీని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది. జగన్ ప్రతిసారి తను చేసిన పనిని చెప్పుకోవాల్సిన పనిలేదు. కేంద్ర సంస్థలే ఎలుగెత్తి మరీ చాటుతున్నాయి ఆయన సత్తా ఏంటో.