ఏపీ కరోనా లెక్కల్లో తేడాలున్నాయి: ఎంపీ రఘురామ కృష్ణరాజు

Advertisement

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా లెక్కల్లో తేడాలున్నాయని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం తప్పుడు లెక్కలను ప్రకటిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. కరోనా మరణాల విషయంలో రాష్ట్రంలో దేశంలో ముందంజలో ఉందని వెల్లడించారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కరోనా కట్టడయ్యిందని జగన్ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో కరోనా ఎందుకో పెరుగుతుందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో రాజకీయాలు చేయకుండా, తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

మద్యం ధరలు పెంచడం వల్లే రాష్ట్రంలోని ప్రజలు శానిటైజర్ తాగి మరనిస్తున్నారని, ధరలు తగ్గిస్తే ఈ మరణాలు తగ్గుతాయని రామరాజు సలహా ఇచ్చారు. మద్యంపై రెండో సారి పెంచిన ధరలను తగ్గించాలని కోరారు. అమరావతి రైతులను కుక్కలతో పోల్చిన వారిపై, రైతులను పైడ్ ఆర్టిస్టులని అన్నవారిపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తప్పుడు సలహాలు ఇస్తున్న వారికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. అలాగే దేశంలోనే పాపులర్ ముఖ్యమంత్రుల్లో 3వ స్థానం పొందిన సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here