మూడు రాజధానులంటే చట్టాన్ని అతిక్రమించడమే: రఘురామ కృష్ణరాజు

Advertisement

రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడమంటే చట్టన్ అతిక్రమించడమే అవుతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో తెలిపారు. రాజధానికి చెందిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదని, ఆ బిల్లు మళ్ళీ పార్లమెంట్ కు రావలసిందేనని ఎంపీ తెలిపారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, రాజధాని క్రెడిట్ కోసమే ఈ వికేంద్రీకరణకు పుణుకున్నారని వెల్లడించారు.

అమరావతికి అనుకూలంగా మాట్లాడిన వారిపై వైసీపీ నాయకులు తమ అనుచరులతో ఆన్లైన్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మూడు రాజధానుల నిర్మాణంపై వైసీపీకి నమ్మకం ఉంటే ఎందుకు ఎన్నికల ముందు ఈ విషయాన్ని మేనిఫెస్టోలో చేర్చలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఉంటే ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా రాష్ట్రం విఫలమైందని, కరోనా మృతదేహాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here