ఈ బుధవారం అమరావతి రైతులు శుభవార్త వింటారు: రఘురామ కృష్ణరాజు

Advertisement

ఢిల్లీ: రాజధాని విషయంలో ఈ బుధవారం రోజు అమరావతి రైతులు శుభవార్త వింటారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంపై ఇవ్వాళ సుప్రీం తీర్పుని ఇస్తూ… హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. హై కోర్ట్ విచారణ సరైన విధానంలో జరిగిందని సుప్రీం వెల్లడించడంతో ఏపీ ప్రభుత్వానికి మళ్ళీ చుక్కెదురు అయ్యింది. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణారాజు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో, పంపిణీలో అక్రమాలు జరిగాయని, దాదాపు రూ. 270 కోట్ల మోసం జరిగిందని వెల్లడించారు. ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీలో ఉన్న దొంగ నేతలను జగన్ దూరంలో పెట్టాలని, లేకపోతే రానున్న రోజుల్లో పార్టీ ప్రమాదంలో పడుతుందని సూచించారు. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తనను వేధిస్తున్నారని, వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here