వైసీపీ నిర్ణయాలను తప్పుపడుతున్న రఘురామ కృష్ణంరాజు

Advertisement

వైసీపీ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు అదే పార్టీకి రెబల్ గా మారిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాల పై మంత్రివర్గ ఉపసంఘం వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. మంత్రివర్గ ఉపసంఘం తర్వాత సిట్‌ ఏర్పాటు చేస్తే దాని పై కోర్టు స్టే ఇచ్చిందని, కోర్ట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా వైసీపీ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద సమీక్ష చేయడం కంటే మన ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే మంచిదని వెల్లడించారు.

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అమరావతి భూముల అంశంపై సీబీఐ విచారణ జరపాలని దిల్లీలో ధర్నా చేశారు కానీ, అంతర్వేది ఘటనపై ఫ్లకార్డులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై దాడి చేస్తూ గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేశారని మండిపడ్డారు. కరోనా తగ్గిన తరువాత తాను అమరావతిలో 10వేల మందితో సభ నిర్వహిస్తానని వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here