అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు : కోడలి నాని

Advertisement

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం పలికిన విషయం అందరికి తెలిసిందే. అయితే శాసన సభ రాజధాని విషయంలో ఏం మంత్రి సంచలన ప్రకటన చేసాడు. పేద ప్రజలు ఉండేందుకు వీలులేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ చెప్పారంటూ మంత్రి కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే అమరావతిలో 55 వేల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరమని విమర్శించారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని పట్టుమీద ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here