MP Avinash Reddy : వైఎస్ వివేక హత్య కేసు.. ఎంపీకి మళ్లీ నోటీసులు ఇచ్చిన సీబీఐ
NQ Staff - January 25, 2023 / 03:35 PM IST

MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కి సంబంధించి సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ రెండో సారి నోటీసులు జారీ చేసింది.
జనవరి 28వ తారీఖున తమ ముందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇటీవలే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.
ఒక్క రోజు ముందు నోటీసులు పంపించడంతో ముందుగా కమిట్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరు కాలేక పోతున్నాను అంటూ అవినాష్ రెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డిని మొదటి సారి సిబిఐ అధికారులు విచారించబోతున్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాష్ రెడ్డి పేరును చేర్చాల్సిందిగా సునీత రెడ్డి విజ్ఞప్తి చేయడంతో సిబిఐ అధికారులు ఆయన విచారించేందుకు సిద్ధమయ్యారు.
విచారణ తర్వాత సిబిఐ అధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, విచారణలో ఏం వెల్లడి కాబోతుంది అనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీ ఎంపీని సిబిఐ అధికారులు విచారణ చేపట్టబోతున్నారంటే కచ్చితంగా అది రాజకీయంగా సంచలనమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.