MP Aravind : కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్?

MP Aravind : ఎంపీ అరవింద్ తెలుసు కదా. ఆయన రెచ్చిపోతే మామూలుగా ఉండదు. ఆయన ముఖ్యంగా టార్గెట్ చేసేదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను. వీళ్లిద్దరిపై ఆయన విమర్శలు స్టార్ట్ చేస్తే ఇక మామూలుగా ఉండదు. బండ బూతులు తిట్టడానికి కూడా వెనుకాడరు అరవింద్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే… ఆమాత్రం ఫైర్ ఉండాలి. తెలంగాణ బీజేపీ నేతలు కాస్త హద్దు మీరి తెలంగాణ సీఎం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల వరంగల్ లో బీజేపీ నేతలకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బాగుండదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

mp aravind shocking comments on minister ktr
mp aravind shocking comments on minister ktr

అయినప్పటికీ… బీజేపీ నేతలు మాత్రం కేటీఆర్ హెచ్చరికను బేఖాతరు చేయలేదు. ఇంకా వాళ్ల స్పీడ్ ను పెంచారు. ఎంపీ అరవింద్ తో పాటు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో కూడా బీజేపీ… టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.

ఎంపీ అరవింద్ కూడా మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కొడుకు అయితేంది… ఎవరైతేంది… కేటీఆర్ ఒక వెదవ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అరవింద్. కేటీఆర్ మత్తు పదార్థాల ప్రభావంతో పిచ్చి కూతలు కూస్తున్నారు అంటూ అరవింద్ మండిపడ్డారు. మోదీని, అమిత్ షాను ఉతికి ఆరేసే స్థాయి కేటీఆర్ కు ఉందా అసలు.. అంటూ అరవింద్ నిలదీశారు. ఒక్కసారి మోదీ, అమిత్ షా కేవలం పది సెకన్ల పాటు వీళ్ల గురించి ఆలోచిస్తే… వీళ్లను తెలంగాణ గల్లీలలో ఉరికిస్తాం… అంటూ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ముందుంది మొసళ్ల పండుగ… 2023 లో టీఆర్ఎస్ నేతలు నామినేషన్ వేయాలంటేనే భయపడాలి.. పసుపు బోర్డు గురించి నన్ను విమర్శించడం కాదు.. పసుపు ఎగుమతులను పెంచాలంటూ నేనే కేంద్రమంత్రులను లేఖ రాశాను. నాకు చిత్తశుద్ధి ఉంది. మరి మీకు ఏమాత్రం ఉంది.. అంటూ అరవింద్ మండిపడ్డారు.

Advertisement