త్వరలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

Advertisement

కరోనా దృష్ట్యా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే తరువాత దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే తాజాగా అన్ లాక్ 3.0 లో జిమ్ లు , యోగ సెంటర్ లు, రెస్టారెంట్లు, మాల్స్ అన్ని కూడా తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ నెల ఆఖరు తరువాత అన్ లాక్ 3.0 ముగియ్యనుంది. దీనితో అన్ లాక్ 4.0 లో సినిమా థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో ఉంది.

దీనితో ప్రభుత్వం సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అని సమాచారం. అయితే సామాజిక దూరం, శానిటైజేష‌న్ వంటి నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశం ఉంది. అలాగే సీట్ల మధ్య దూరాన్ని త్వరలో ప్రభుత్వం మార్గ దర్శకాలు వెల్లడించనుంది. అలాగే సినిమా హాలుల్లో టెంపరేచర్ చెకింగ్, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోనుంది. అలాగే ప్రతి షో తరువాత సినిమా హల్ మొత్తం శానిటైజేషన్ చేయనున్నారు. ఒకవైపు సినిమా హాళ్లు కూడా తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుతివ్వాల‌ని ప‌లు థియేట‌ర్ యాజ‌మాన్యాలు ఇప్పటికే ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి కూడా చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here