థియేటర్లు తెరిచినా.. ఓటిటికి క్రేజ్ తగ్గదా..!
Admin - October 3, 2020 / 07:28 AM IST

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇతర ఎంటర్ టైన్మెంట్ కు సంబందించిన వినోదాలు చూడాలన్న ఓటిటి ప్లాట్ ఫర్మ్ ద్వారా హాయిగా చూస్తున్నారు. అయితే ఒక పక్క థియేటర్లు మూతపడడంతో ఓటిటికి అధికంగా డిమాండ్ పెరిగింది. అయితే కరోనకు ముందు పోల్చుకుంటే.. ఓటిటి డిమాండ్ ఎక్కువగా పెరిగింది. అలాగే ఓటిటి యాప్స్ కు పెయిడ్ యూజర్లు అధికంగా అయ్యారు. అయితే కరోనా కు ముందు తో పోలిస్తే ప్రస్తుతం ఈ పెయిడ్ యూజర్లు 60 శాతం నుండి 80 శాతం వరకు పెరిగారు.
ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, దిశను హాట్ స్టార్ వినియోగదారులు రెట్టింపు అయ్యారు. అయితే దీనికి కారణం సబ్ స్క్రిప్షన్ రేట్లు తగ్గడమేనని తెలుస్తుంది. అంతేకాదు ఓటిటి లో మంచి కంటెంట్ ఉన్న వినోదాలు ఉండడం కూడా కారణమే అని అంటున్నారు. అయితే ఇప్పుడు థియేటర్లు తెరిచినా కూడా ఓటిటి ప్లాట్ ఫర్మ్ కు డోకా ఉండదని అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో ఓటిటి కీలకంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో ఓటిటి కి తిరుగుండదని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.