Celebrities : పునీత్ నుండి తారకరత్న వరకు.. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన సెలెబ్రిటీలు వీరే!
NQ Staff - February 19, 2023 / 03:42 PM IST

Celebrities : ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద వార్తలను వింటున్నాం.. అది కూడా నాలుగు పదుల వయసులోనే మరణిస్తున్న సినీ సెలెబ్రిటీలు ఎక్కువ మంది అయ్యారు.. కారణం గుండెపోటు.. చాలా చిన్న వయసులోనే ఇలా మరణించి వారి ఫ్యాన్స్ కు తీరని శోకం మిగులుస్తున్నారు.. గడిచిన 18 నెలల్లోనే ఏకంగా 7 సెలెబ్రిటీలు చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు.. పునీత్ రాజ్ కుమార్ నుండి తారకరత్న వరకు గుండెపోటుతో మరణించి సెలెబ్రిటీలు ఎవరో చూద్దాం..
సిద్ధార్థ్ శుక్లా : బాలికా వధు, బిగ్ బాస్ వంటి కార్యక్రమాలతో అలరించిన బాలీవుడ్ సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో 2021 సెప్టెంబర్ 2న మరణించారు.. డిన్నర్ చేసి పడుకున్న సిద్ధార్థ్ ఇంకా లేవనేలేదు..
పునీత్ రాజ్ కుమార్ : కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న పునీత్ రాజ్ కుమార్ అనుకోకుండా 2021 అక్టోబర్ 29న జిమ్ లో వ్యాయామం చేస్తూనే హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు.. ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలారు.. ఈయన 46 ఏళ్ల వయసులోనే కన్నుమూసి ఫ్యాన్స్ కు తీరని దుఃఖాన్ని మిగిల్చారు..
మేకపాటి గౌతమ్ రెడ్డి : ఏపీ ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా హఠాత్తుగా మరణించడం బంధువులకు, పార్టీ నాయకులకు తీరని లోటు మిగిల్చింది.. ఈయన కేవలం 49 ఏళ్ల వయసులోనే మరణించారు.. 2022 ఫిబ్రవరి 21న ఈయన మరణించడం జరిగింది.. ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండే గౌతమ్ రెడ్డి మరణం కుటుంబ సబ్యులకు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి..
సింగర్ కెకె : ప్రముఖ సింగర్ కెకె 53 ఏళ్ల వయసులోనే కోల్ కత్తా లోని ఒక కాలేజ్ ఫస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా 2022 మే 31న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. అలా పడిన ఆయన మళ్ళీ లేవలేదు.. ఈయన కూడా హార్ట్ ఎటాక్ తోనే మరణించినట్టు వైద్యులు తెలిపారు..
సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ : ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కూడా హార్ట్ ఎటాక్ తో మరణించారు. 2022 నవంబర్ 1న ఈయన జిమ్ లో వ్యాయామం చేస్తూనే కుప్పకూలారు..
రాజు శ్రీవాత్సవ : 2022 సెప్టెంబర్ 21న ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా గుర్తింపు పొందిన రాజు శ్రీవాత్సవ కూడా మరణించారు. ఈయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రాగా 41 రోజుల చికిత్స తర్వాత ఈయన మరణించారు..
నందమూరి తారకరత్న : నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరి 18న మరణించారు. 40 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్ తో ఈయన మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.. నందమూరి తారకరత్న జనవరి 27న పాదయాత్రలో పాల్గొనగా గుండె పోటుతో కుప్పకూలారు.. ఇన్ని రోజుల చికిత్స తర్వాత నిన్న తారకరత్న కన్నుమూశారు..