Mukesh Ambani : డ్రైవర్‌ కి అంబానీ ఇచ్చే జీతం.. ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ఉద్యోగి కంటే ఎక్కువ

NQ Staff - March 4, 2023 / 07:00 PM IST

Mukesh Ambani : డ్రైవర్‌ కి అంబానీ ఇచ్చే జీతం.. ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ఉద్యోగి కంటే ఎక్కువ

Ambani Family : ప్రముఖ సాఫ్ట్‌ వేర్ కంపెనీల్లో ఫ్రెషర్స్ గా జాబ్ లో జాయిన్ అయ్యే వారికి ఏడాదికి అయిదు లక్షల జీతం ఇవ్వడం గగనం. అలాంటిది ముఖేష్ అంబానీ యొక్క డ్రైవర్‌ కి ఏకంగా ఏడాదికి 20 లక్షల రూపాయల జీతం అందుతోందట. ముఖేష్ అంబానీ యొక్క డ్రైవర్‌ కి మాత్రమే కాకుండా అంబానీ ఫ్యామిలీ కోసం డ్రైవర్‌ గా చేసే వారందరికి కూడా భారీ మొత్తంలో జీతాలు అందుతూ ఉంటాయట.

ముంబై వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అంబానీ ఫ్యామిలీ డ్రైవర్స్ లో చాలా మందికి నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ జీతం అందుతుందట. లక్షల కోట్ల సంపాదన ఉన్న అంబానీ ఫ్యామిలీ డ్రైవర్స్ అంటే ఆషామాషీ కాదు కదా.. అందుకే లక్షల రూపాయల జీతం ను వారు అందుకుంటూ ఉంటారు.

అంబానీ ఇంటి డ్రైవర్‌ కావాలి అనుకుంటే ఏదో కారు డ్రైవింగ్‌ వచ్చి ఉంటే సరిపోదు. ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి.. అలాగే అత్యాధుని సాంకేతిక నిపుణులు అయ్యి ఉండాలి. అలా అయితేనే అంబానీ ఇంట్లో డ్రైవర్‌ గా జాబ్ లభిస్తుంది. ఏ గవర్నమెంట్‌ జాబ్ కానీ.. ఏ సాఫ్ట్‌ వేర్ జాబ్‌ కానీ సరి తూగని విధంగా అంబానీ ఇంటి డ్రైవర్లు సంపాదిస్తూ ఉన్నారు. చేస్తున్న జాబ్‌ మానేసి అంబానీ ఇంట డ్రైవర్ గా చేరాలి అనిపిస్తుంది కదా..!

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us