Condom: ప్ర‌పంచంలో కెల్లా అత్యంత ఖ‌రీదైన కండోమ్.. ధ‌ర తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

Condom: ఎయిడ్స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో కండోమ్ వాడ‌కం ఎక్కువైంది. ఎయిడ్స్‌కి మందు లేదు నివార‌ణ ఒక్క‌టే మార్గం అని ప్ర‌భుత్వాలు విరివిగా ప్ర‌క‌టన చేయ‌డంతో బ‌య‌టి వారితో సెక్స్‌లో పాల్గొనే వాళ్లు కండోమ్స్ త‌ప్ప‌క వాడుతున్నారు. మ‌రో వైపు గ‌ర్భం రాకుండా కూడా కండోమ్‌ని ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కండోమ్స్ అనేవి కిరాణా దుకాణాల నుంచి మెడికల్ షాపుల వరకూ అన్నింట్లో దొరుకుతుంది.

కండోమ్ సాధార‌ణంగా ప‌ది రూపాయ‌ల‌కే ల‌భిస్తుంది. కాస్ట్‌లీ అయితే కొంచెం ధ‌ర పెరుగుతుంది. అయితే తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ను తయారు చేశారు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఒక‌ప్పుడు ధ‌న‌వంతులు మాత్ర‌మే కండోమ్స్ వాడేవారు. 200 ఏళ్ల నాటి నుండి కండోమ్ వాడ‌కం ఉంద‌ని తాజాగా బ‌య‌ట‌పడింది.

కొద్ది రోజుల క్రితం స్పెయిన్ న‌గ‌రంలో చిన్న పెట్టె బ‌య‌ట‌ప‌డింది. ఆ పెట్టెలో ఏముందా అని తీసి చూస్తే కండోమ్ బ‌య‌ట‌పడింది. 19 సెంటిమీటర్లు ఉన్న ఆ కండోమ్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. దాన్ని ప్రయోగశాలలో టెస్ట్ చేస్తే అది ఏకంగా 200 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. దీనిని గొర్రె పేగుతో త‌యారు చేసిన‌ట్టు తేల‌గా, దీనిని వేలం వేసారు.

ఆన్‌లైన్ వేదిక‌గా జరిగిన వేలంలో చాలా మంది పాల్గొన్నారు. పురాత‌న కాలంది కావ‌డంతో అమ్ స్టర్ డామ్ కు చెందిన వ్యాపారవేత్త ఆ కండోమ్ ను దక్కించుకున్నాడు.అయితు ఈ పురాతన కాలంలో కూడా గర్భం రాకుండా కండోమ్ లు వాడారని.. అప్పుడు శస్త్రచికిత్సలు లేకపోవడంతో దీంతోనే గర్భం రాకుండా అడ్డుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ పురాతన కాలం నాటి కండోమ్స్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి.

గొర్రె పేగుతో త‌యారు చేసిన కండోమ్ అనే స‌రికి ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికాలం నాటి కండోమ్ లు కనీసం 15 సెంటిమీటర్ల పొడువు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.