‘మోసగాళ్లు’ మోషన్ పోస్టర్ విడుదల
Admin - September 18, 2020 / 07:22 AM IST

టాలీవుడ్ లో కరోనా దృష్ట్యా సినిమాలకు బ్రేక్ పడి ఇప్పుడిప్పుడే మల్లి సినిమాలు మొదలవుతున్నాయి. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘మోసగాళ్ళు’ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇక ఈ సినిమా జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హీరో దగ్గుబాటి వెంకటేష్ లాంచ్ చేశారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం గురించి హాలీవుడ్, ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.

ఇక మరోక విషయం ఏంటంటే.. ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రల్లో నటిస్తున్నారని ఆ చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఇక దీంతో వీరిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న సస్పెన్స్ అభిమానుల్లో పెద్ద ఎత్తున నెలకొంది. ఇక ఈ మూవీ ఓటిటి ద్వారా విడుదలవుతుందా.. లేక థియేటర్లు తెరిచే వరకు వెయిట్ చేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.