Panipuri : కొంప ముంచిన పానీపూరి..100 మందికి అస్వ‌స్థ‌త‌..!

NQ Staff - August 12, 2022 / 03:30 PM IST

150920Panipuri : కొంప ముంచిన పానీపూరి..100 మందికి అస్వ‌స్థ‌త‌..!

Panipuri : పానీపూరి.. ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది. ఇక రుచి చూస్తే అస్స‌లు వ‌దిలి పెట్ట‌బుద్ది కాదు. చిన్న పిల్లాడి నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు పానీపూరిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే వ‌ర్షా కాలంలో పానీపూరితోతింటే అనేక అన‌ర్ధాలు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నా కూడా కొంద‌రు ఎంచ‌క్కా లాగేస్తున్నారు. తాజాగా పానీపూరి తిని వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.

పానీపూరి ఎఫెక్ట్..

ప‌శ్చిమ బెంగాల్ కి చెందిన‌ హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని ఒక వీధిలో పానీపూరి దుకాణం ఉంది. అందులో.. స్థానికులు కొంత మంది రోజంతా పానీపూరీ తిన్నారు. అయితే.. తిన్న కాసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంట వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి.

More Than Hundred People Fell Ill After Eating Panipuri

More Than Hundred People Fell Ill After Eating Panipuri

వారిని వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితులను టెస్ట్ చేసిన వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ తోనే ఇలా జరిగిందని అన్నారు.అదే విధంగా అస్వస్థతకు గురైన వారు.. డోగాచియా, బహిర్ రణగాచా, మకల్తలా నివాసితులుగా డాక్టర్లు గుర్తించారు. బాధితులందరికి ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. వారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. ఎక్కువ మంది జబ్బుపడిన వారిని ఆసుపత్రులలో చేరినట్లు తెలుస్తోంది. గత మే నెలలో కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. మండలా జిల్లాలో జరిగిన ఓ జాతరలో పానీపూరి తిని 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.