351మంది పోలీసులకు కరోనా. ఎక్కడంటే..

Advertisement

దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు చాలా వరకు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె మహారాష్ట్రలో కరోనా దారుణంగా విస్తరిస్తుంది. అయితే ఇప్పటికే ఆ రాష్ట్రంలో సైతం చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అదే విధంగా ఒకపక్క పోలీసు అధికారులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. రోజుకు వందలాది మంది పోలీసులు కరోనా బారిన పడుతున్నారు.

ఇక గత 24 గంటల్లో మహారాష్ట్రలో 351మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీనితో కరోనా సోకిన మొత్తం పోలీసుల సంఖ్య 14,067కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో ముగ్గురు పోలీసులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య 142కు చేరుకుంది. ఇక ప్రస్తుతం కరోనా సోకిన పోలీసులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here