Monika Bhadoriya : ఆ నిర్మాత వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. నటి ఆరోపణలు..!
NQ Staff - June 7, 2023 / 10:39 AM IST

Monika Bhadoriya : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రోజు రోజుకూ వేధింపులు బాగా పెరిగిపోతున్నాయి. ఇవి మేం అంటున్న మాట కాదు. చాలామంది నటీమణులు బయటకు వచ్చి చేస్తున్న ఆరోపణలు. కాస్టింగ్ కౌచ్ పేరుతో చాలామంది హీరోయిన్లు, నటీమణులు నలిగిపోతున్నారు. అందులో కొందరు బయటకు వచ్చి చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం బయటకు రావట్లేదు.
తాజాగా ఓ నటి కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. ఆమె ఎవరో కాదు మోనికా భడోరియా. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. గతంలో నేను ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షోలో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆ షో నిర్మాత నన్ను చాలా వేధించాడు. తన కోరిక తీర్చాలంటూ వెంట పడ్డాడు.
అదే సమయంలో మా అమ్మ క్యాన్సర్ తో ఆస్పత్రిలో చేరింది. అమ్మకు ట్రీట్ మెంట్ చేయించడం కోసం ఇష్టం లేకపోయినా రోజూ ఆ షో షూటింగ్ కు వెళ్లేదాన్ని షూటింగ్ లో ఆ నిర్మాత ఎక్కడ పడితే అక్కడ చేతులేసేవాడు. చేసేది లేక అలాగే మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే అప్పుడు నాకు ఆ రెమ్యునరేషన్ చాలా అవసరం.
మా అమ్మకు కనీసం సాయం కూడా చేయలేదు. వాడి కోరిక తీర్చలేదని రోజూ షూటింగ్ లో నన్ను ఆ షో మేకర్స్ టార్చర్ చేశారు. చివరకు నాకు రావాల్సిన రెమ్యునరేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. నాకు చాలా బాధ వేసింది. అప్పటి నుంచి ఆ నిర్మాత ముఖం కూడా చూడట్లేదు అంటూ తెలిపింది ఈ భామ.