మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ప్రత్యేకతలు, ఆయన ఘనత

Advertisement

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని భారత్ లో ఇంజినీర్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇవ్వాళ ఆయన పుట్టిన రోజు కాబట్టి తమ ఫ్యూచర్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎక్స్ ట్రా ఫీచర్స్ గల జీవన విధానాన్ని అందించే వారందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించాడు. అతను తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు.

పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యాడు. పుణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషను చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు

అవార్డ్స్:

*1955లో అతనుకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది.

  • ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు.

*1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ గా నియమితుడయ్యాడు

*విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా అతను పాత్ర ఉంది. కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట అతను పర్యవేక్షణలోనే జరిగింది.

ఆయన ఏప్రిల్ 12 1962లో మరణించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here