Mokila HMDA Venture Plots Prices Received Good Response : నాల్గవ రోజు మోకిలలో అదే జోరు.. జోరుగా ప్లాట్ల అమ్మకం..!
NQ Staff - August 29, 2023 / 09:22 AM IST

Mokila HMDA Venture Plots Prices Received Good Response :
హైదరాబాద్ లో హెచ్ ఎండీఏ ప్లాట్లకు ఏ స్థాయిలో విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిమాండ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అయితే ఇప్పుడు మోకిల హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఇక నాలుగవ రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో ప్లాట్లకు గజానికి రూ.70వేల నుంచి రూ.1,05,000ల వరకు వచ్చింది.
హెచ్ఎండిఏ మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లకు వేలం నిర్వహిస్తోంది. అటు ఫేజ్-2 లో 300 ప్లాట్లకు వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం 30 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. మధ్యాహ్నం మరో 30ప్లాట్లకు వేలం వేశారు. ఈ 60 ప్లాట్లకు కలిపి మొత్తంగా రూ.46.50 కోట్లు వచ్చాయి.
ఇక వీటి రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం విశేషం. ఫస్ట్ రోజున 58 ప్లాట్లు అమ్మగా.. రూ.122.42 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక రెండో రోజు నిర్వహించగా రూ.131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆదివారం నాడు నిర్వహించగా.. రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఈ స్థాయిలో భారీ డిమాండ్ ఏర్పడింది.