కరోనా సమయంలో పోలీసుల పాత్ర చరిత్రలో లిఖించబడుతుంది : మోడీ

Advertisement

కరోనా కట్టడిలో వైద్యులతో పాటు పోలీసులు చేసిన కృషి కూడా వర్ణించలేనిదని, కరోనా సమయంలో పోలీసులు విధులు నిర్వహించిన తీరు చరిత్రలో లిఖించబడుతుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. యోగా, ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతని చెప్పారు.

కరోనా వల్ల ప్రజలకు పోలీసులంటే భయం పోయి గౌరవం పెరిగిందని మోడీ వెల్లడించారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని, కరోనా కష్ట కాలంలో ఖాకీల మానవీయ కోణం ప్రజలకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ఐపీఎస్‌ ప్రొబేషనర్లను గతంలో ఇంటికి ఆహ్వానించే వాడినని, కొవిడ్‌ కారణంగా ముఖాముఖి కలుసుకోలేకపోతున్నానని, త్వరలోనే మీతో సమావేశమవుతానని మోదీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here