పార్లమెంట్ భవనాన్ని కూల్చేయనున్న కేంద్రం
Admin - July 29, 2020 / 01:01 PM IST

కేంద్ర ప్రస్తుతం పార్లమెంట్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పార్లమెంట్ భవనం అతి పురాతనమైనది అని అందుకోసమే కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం పై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ ను దాఖలు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భద్రతా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పేర్కొంది. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించిన కూడా కష్టమేనని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అందుకోసమే ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కూల్చి అదే స్థలంలో కొత్త బిల్డింగ్ ను నిర్మిస్తామని కేంద్రం తెలిపింది.