Cell Phone: క‌డుపు నొప్పితో ఆసుపత్రికి వెళితే మొబైల్ బ‌య‌ట ప‌డింది..!

Cell Phone: ఈ మ‌ధ్య కాలంలో కడుపు నొప్పితో ఆసుప‌త్రికి వెళ్లిన వారి క‌డుపులో నుండి విచిత్ర‌మైన వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. రూపాయి నాణేలు, వెంట్రుక‌లు,క‌త్తులు ఇలా ఒక‌టేంటి ఎన్నో వ‌స్తువులు బ‌య‌టకి వ‌స్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మొబైల్‌ ఫోన్‌ మింగేయ‌గా, దానిని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.

TheNewsQube-

ఈ విచిత్ర సంఘటన ఈజిప్ట్‌ దేశంలో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యులు అతని కడుపుని ఎక్క్‌రే తీసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పేషెండ్‌ కడుపులో మొబైల్‌ ఫోన్‌ కనిపించడంతో వైద్యులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్‌ను మింగిన్నట్లు వైద్యులకు తెలిసింది.

మింగిన ఫోన్ స‌హజంగానే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అతడు భావించాడు. కాని అలా జ‌ర‌గ‌లేదు. అన్నం మాదిరిగా అది జీర్ణ‌మవుతుంద‌ని అనుకోగా, అది జీర్ణం కాకుంగా అలాగే ఉండిపోయింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు.

ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోగా.. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు కంగారు పడ్డారు.

చాలా గంట‌ల పాటు క‌ష్ట ప‌డ్డ అత‌నికి విజ‌య‌వంత‌మైన‌ ఆపరేషన్ చేశారు. ఆప‌రేష‌న్‌ సక్సెస్ అయి సురక్షితంగా బయటపట్టాడు. ఈ విష‌యం అందరి నోట ప‌డి వైర‌ల్‌గా మారింది.