Charging:ఈ విష‌యం తెలుసా.. చెమ‌ట‌తో మొబైల్ ఛార్జింగ్‌

Charging: టెక్నాల‌జీ రోజురోజుకి సరికొత్త పుంత‌లు తొక్కుతుంది.శాస్త్ర‌వేత్త‌లు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నారు. ప్ర‌కృతిలో వ‌చ్చే ప్ర‌ళ‌యాల‌ను కూడా ముందే ప‌సిగ‌డుతున్నామంటే ఎంత అడ్వాన్స్‌డ్ ఉన్నామో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొబైల్స్ ద్వారా అర‌చేతిలో ప్రపంచాన్ని చుట్టొస్తున్నాం.

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి మొబైల్ అనేది కామ‌న్‌గా మారింది. చిన్నా, పెద్ద‌, పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌ర మొబైల్స్ ఉంటున్నాయి. అయితే ఎంత కాస్ట్ లీ ఫోన్ కొన్నా ఛార్జింగ్ లేక‌పోతే వేస్టే. ఇప్పుడు ఛార్జింగ్ స‌మ‌స్య కామ‌న్‌గా మార‌గా, వాటి కోసం స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు కూడా చేశారు. జ‌ర్నీలో ఉన్న‌ప్పుడు ఛార్జింగ్ కోసం ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌ని ఇప్ప‌టికే రూపొందించ‌గా, ఇప్పుడు మాన‌వ శ‌రీరం నుండి వ‌చ్చే చెమ‌టతో కూడా ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చి అంటున్నారు.

చెమటతో మొబైల్‌ ఫోన్లకు ఛార్జింగ్‌ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్‌ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్‌ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్‌ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్‌ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది.

ఆ శ‌క్తితో స్మార్ట్ వాచ్ దాదాపు 24 గంట‌లు న‌డుస్తుంద‌ని కూడా అంటున్నారు. చేతి వేళ్లకు, మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్‌పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. ఏదేమైన కొత్త టెక్నాల‌జీ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.